DNB News - తెలంగాణ / : మునగాల:దక్షిణభారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య,జీవితం నేటి తరానికి ఆదర్శం అని సీపీఎం పార్టీ మండలకార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు. మంగళవారం రాత్రి మండల పరిధిలోని కలకోవ గ్రామంలో అమరవీరుల సంస్మరణ భవనంలో పార్టీనాయకులు అనంతు గుర్వయ్య, అధ్యక్షుతన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ మండలకార్యదర్శి బుర్రి శ్రీరాములు హాజరై మాట్లాడారు. అనంతరం పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెరిగిన పుచ్చలపల్లి సుందరయ్య పేదప్రజలు, వ్యవసాయ కూలీలు, కార్మికుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఎంపీగా ఉండి సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లి రాజకీయాల్లో అందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప మహనీయుడని కొనియాడారు.భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం తెలంగాణ ప్రాంతంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య అగ్ర భాగాన ఉండి సాయుధ పోరాటాన్ని నడిపారన్ని అన్నారు. వందలాది ఎకరాలు కలిగిన భూస్వామ్య కుటుంబంలో పుట్టిన సుందరయ్య ప్రజల కోసం తనకు వారసత్వంగా వచ్చిన వందలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి ఇచ్చి, జీవితాంతం నిరాడంబర జీవితాన్ని గడిపారని కొనియాడారు. 1934 వ సంవత్సరంలో తన సొంత గ్రామం నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా అలగానిపాడు లో వ్యవసాయ కార్మిక సంఘం స్థాపించి,వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపిన మహా యోధుడు సుందరయ్య అని కొనియాడారు. పార్లమెంటుకు, శాసనసభకు సైకిల్‌పై వెళ్లేవారన్నారు. సమాజమే తన పిల్లలు అనుకుని తాను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. నేడు ఎంతోమంది రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేస్తున్నారని, విలువలను మరిచి అక్రమ సంపాదనకు, పదవి వ్యామోహంతో డబ్బు కోసం పార్టీలు మార్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. నేటి యువత సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జూలకంటి విజయలక్ష్మి,సైదా, సర్పంచ్ మండవ వెంకటాద్రి, సుంకర పిచ్చయ్య,శాఖకార్యదర్శులు కాసాని ముత్తయ్య, పడిసిరి నరసింహారావు, శీను, ప్రజానాట్యమండలి కళాకారుచే అమరవీరుల స్మృతి గీతాలు ఆలపించారు.
Admin
DNB News