Saturday, 18 April 2026 06:03:16 PM
# మంగ్లీపై ఆరోపణల్ని ఖండిస్తున్నాం..అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు భూక్యా హరినాయక్ # విజయవాడలో బిజెపి కీలక సమావేశం – రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం.. # పోచమ్మ చెరువులో పూడికతీత పనులకు భూమి పూజ – స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై కలెక్టర్ డా.ఏ.సిరి అవగాహన # స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పోలీసుల స్వచ్ఛత కార్యక్రమాలు... # శాతవాహనలో ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు # విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కరీంనగర్ # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ లో పతకాలు # రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు

విద్యార్థులు విజయోస్తూ..!

Date : 13 March 2026 05:01 PM Views : 35

DNB News - తెలంగాణ / : కన్నవారి కలలను నెరవేర్చేందుకు.. ఉజ్వల భవిష్యత్తును అందుకునేందుకు పదవ తరగతి విద్యార్థులు ఈనెల 14వ తేదీ నుంచి జరిగే పరీక్షలను మంచిగా రాసి ఉత్తీర్ణులు అవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష రాయనున్న 5, 17,727 మంది విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్ష కేంద్రాలకు సమయానికన్నా అరగంట ముందు కచ్చితంగా వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లో పరీక్ష రాయనున్న విద్యార్థులందరికీ ముందస్తుగా అభినందనలు తెలిపారు. విద్యార్థులకు చదువుపై ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని తాను పదవ తరగతి చదివే పేద విద్యార్థులందరికి దాదాపుగా 20వేల మందికి ఉచితంగా సైకిళ్లను అందించాననే విషయాన్ని గుర్తు చేశారు. దీంతో పాఠశాలకు విద్యార్థులంతా సకాలంలో వెళ్లేందుకు అవకాశం దక్కిందని చెప్పారు. అంతేకాకుండా పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజును తాను చెల్లించానని దీంతో వారి తల్లిదండ్రులకు కొంత ఆర్థిక భారం తప్పిందన్నారు. పరీక్షల సమయంలో అనవసరమైన ఆందోళన ఒత్తిడికి గురి కాకూడదని ఇన్నాళ్లు శ్రద్ధతో చదివిన సబ్జెక్టులను పునశ్చరణ చేసుకొని మంచిగా పరీక్ష రాయాలని హితవు పలికారు. గతేడాది పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ జిల్లా ఉత్తీర్ణతా పరంగా ఆరో స్థానంలో సిరిసిల్ల జిల్లా ఐదవ స్థానంలో నిలిచిందని.. ఈసారి తప్పకుండా ఈ రెండు జిల్లాలు మొదటి రెండవ స్థానాల్లో నిలిచి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. మరోవైపు అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు పోలీసులు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు రవాణా పరంగా ట్రాఫిక్ పరంగా ఇబ్బంది ఉండకుండా చూడాలని సూచించారు. తాను ఈ నెల 14వ తేదీన చేపడుతున్న కొండగట్టు అంజన్న పాదయాత్ర సమయంలోను ఎక్కడ కూడా విద్యార్థులకు అసౌర్యం కలగకుండా చూసుకుంటామని ఈ దిశగా నాయకుల్ని, కార్యకర్తలను సమాయత్తం చేశామన్నారు. పరీక్ష కేంద్రాలను విద్యార్థులకు తగిన వసతులను కల్పించాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వారికి ఫ్యాన్ల సదుపాయంతో పాటు మంచినీళ్లు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. మరోవైపు విద్యార్థులను తల్లిదండ్రులు క్షేమంగా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి పరీక్ష లో పాసై ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని శత శాతం ఫలితాలు సాధించాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :