Wednesday, 17 June 2026 02:21:30 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

'మే డే' కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు...!!

Date : 01 May 2026 02:58 PM Views : 29

DNB News - తెలంగాణ / : ఒకనాడు కార్మిక వర్గాన్ని మొత్తం ఒక్క తాటిపై నడిపి కార్మిక శక్తిని కదం తొక్కించిన ఆనాటి కార్మిక నాయకులు ఏరి..? ఒకనాటి ఉద్యమ స్పూర్తి ఏది..?.. ఒకప్పుడు మే డే అంటే ఆ కళే వేరు.. ముఖ్యంగా పెద్ద పట్టణాలలో నగరాలలో ఎక్కడ చూసినా ఈరోజు హడవిడి అంతా పెద్ద పండగలా ఉండేది.. రిక్షా యునియన్ల దగ్గర నుండి రైస్ మిల్లు కార్మికుడి దాక.. పెద్ద పెద్ద కంపెనీల్లో ప్రభుత్వ రంగ సంస్ధల్లో కార్మిక సంఘాల గురించి.. ట్రేడ్ యునియన్ల గురించి చెప్పే పని లేదు.. మంచి పోరాట స్పూర్తి కార్మిక హక్కులపై పూర్తి అవగాహన ఉన్న గొప్పగొప్ప నాయకుల నేతృత్వంలో కార్మికుల హక్కులు ప్రయోజనాలే ద్యేయంగా యాజమాన్యాలకు అనుసంధానంగా జన బాహుళ్యంలో చాలా క్రియాశీలకంగా ఉండేవి.. వ్యవస్థీకృత అవ్యవస్తీకృత రంగాల్లో పని చేసే కార్మికులకు తమ హక్కుల పట్ల ఐక్యత పైన అంతో ఇంతో చైతన్యం వచ్చిందంటే అది ఖచ్చితంగ నటి క్రియాశీలక కార్మిక సంఘాలు ఉద్యమాల పుణ్యమే.. కానీ దురదృష్టవశాత్తూ ఈ ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పుణ్యమా అని.. కార్మిక సంఘాలు క్రమేపీ తమ ఉనికిని పోగుట్టుకుంటూ వచ్చాయి.. దానికి మతతత్వ శక్తులు మన రాజకీయాలని మన సమాజాన్ని కబ్జా చేసి మన సగటు మనిషి ఆలోచన దోరణిని తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం విజయవంతంగా తమవైపు తిప్పుకునేలా చేయడం కూడా ఒక కారణం అయితే.. ఈ సర్వీస్ సెక్టారు సాఫ్ట్వేర్ ఫార్మా మ్యానిఫ్యాక్చరింగ్ రంగాల్లో యాజమాన్యాలు సంస్థలు ఉద్యోగులకు కొంత అనుకూలంగా తమ విధానాలు రూపొందించుకోవడం.. మలిదశ కార్మిక యునియన్లు సంఘటనలు సంఘటితంగా లేకుండా పోవడం ఒక కారణం! అప్పటికి ఇప్పటికీ మార్పు ఏదైనా ఉందంటే ఈరోజు యాజమాన్యానికి తమ ఉత్పత్తికి కార్మికుడితో అవసరం పడింది.. పనికి డిమాండ్ పెరిగి కార్మికుడికి మార్కెట్ లో కొంత ప్రాధన్యత పెరిగింది (అది కేవలం మార్కెట్ డిమాండ్ వల్లనే).. అనేక సంవత్సరాల పోరాటాలు చట్టాల వల్ల కనీస గౌరవ వేతనం అనేది కొంతలో కొంత దక్కగలుగుతుంది.. మరి కార్మిక రంగంలో దోపిడి మోసం పూర్తిగా అంతం అయిందా అంటే..? అది ఈ మానవ జాతి ఉన్నంత వరకు ఆ దోపిడి పోయేది కాదు.. కాకపోతే ఇప్పుడు ఒక్క యాజమాన్యాల రూపంలోనే కాకుండా అంతర్గతంగా ముఠా మేస్త్రీలు లేబర్ కాంట్రాక్టర్ల రూపంలో ఇలా ఏదొక రకంగా దోపిడీ మాత్రం నిరాఘంటంగా కొనసాగుతూనే ఉంది.. అయితే అప్పటికి ఇప్పటికి కొంత పరిస్తితులు మెరుగైన మాట వాస్తవం.. దానికి కొన్ని తరాల పోరాటాల సమయం పట్టింది.. ఇక మిగతా అందరిలాగా సమాన హోదా.. ఉద్యోగ భద్రత మెరుగైన జీవన ప్రమాణాలతో పాటు కార్మికుల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం జరగాల్సిన సంస్కరణలు.. కార్మికలోకం సాధించాల్సిన హక్కులు చాలా ఉన్నాయి.. ఇక మార్పు సహజం మార్పు అనివార్యం.. ఇది కేవలం చదువు ప్రజల్లో నిరంతర చైతన్యం ద్వారా మాత్రమే సాధ్యం.. ఏదేఏమైనా ప్రపంచ కార్మికులందరికి స్పూర్తినిచ్చేదిగా.. వారి కార్మిక శక్తిని వారి ఉనికిని సమాజానికి గుర్తు చేసే రోజుగా మేడే ఎప్పటికీ ప్రత్తేకమే.. నా దృష్టిలో ఈ మే-డే నే అందరూ జరుపుకోవాల్సిన నిజమైన అతి పెద్ద పండుగ.. 'మే డే' ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు...!!????

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :