Wednesday, 17 June 2026 03:05:46 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ బిఆర్ఎస్ పోరుబాట ఆగదు. బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ

Date : 27 January 2026 01:13 PM Views : 77

DNB News - తెలంగాణ / : కోదాడకు చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ ను చిత్రహింసలు పెట్టి తన మరణానికి కారణమైన చిలుకూరు ఎస్సై సుధీర్ రెడ్డి, కోదాడ రూరల్ సీఐ ప్రతాప లింగం, కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి ల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని ఉద్యోగ బాధ్యతలు నుండి డిస్మిస్ చేయాలని, రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చలో కోదాడ కార్యక్రమానికి పిలుపునిచ్చిన కోదాడ మాజీ శాసనసభ్యులు లు బీసీబిడ్డ బొల్లం మల్లయ్య యాదవ్ దిష్టిబొమ్మలు తగలబెట్టడం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దంపతుల అగ్రవర్ణాల ఆధిపత్యానికి పరాకాష్ట అని బిఆర్ఎస్ పార్టీ మునగాల పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ అన్నారు, సోమవారం మండల కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళిత యువకుడు కర్ల రాజేష్ మృతి చెంది రెండు నెలలు కావస్తున్నా రాజేష్ కుటుంబానికి జరిగిన అన్యాయం పై మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిలుస్పందించకపోవడంబాధాకరమన్నారు, బాధ్యులపై చర్యలుతీసుకోకుండాఅడ్డుపడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజేష్ మృతికికారణమైన పోలీసు అధికారులను పాత్రధారులను సూత్రధారులను కాపాడుతూ వస్తున్న మంత్రి ఉత్తమ్ దంపతుల కుట్రకోణాన్ని ఈనెల 24న చలో కోదాడ కార్యక్రమం సందర్భంగా మాజీ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ భారీ ర్యాలీ బహిరంగ సభలో బయట పెట్టారన్నారు, దీంతోవ్యక్తిగతంగా తమ యొక్క పదవులకు తమ రాజకీయ ఆధిపత్యానికి కోదాడ హుజూర్నగర్ ప్రజలు ముగింపు పలుకుతారని భయంతో ఉత్తమ్ దంపతులు కోదాడ నియోజకవర్గంలోని వివిధ మండలాలలో కాంగ్రెస్ పార్టీ అగ్ర కుల నాయకులను రెచ్చగొట్టి ఆదివారం బీసీ బిడ్డ మల్లయ్య యాదవ్ దిష్టిబొమ్మల దానానికి పూనుకోవడందురదృష్టకరమన్నారు,ఒక దళిత యువకుడి మృతిపై స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని పోరాడుతున్న బీసీ బిడ్డ మల్లయ్య యాదవ్ దిష్టిబొమ్మల దహనంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాక్షసానందం పొందటంతప్ప సాధించింది ఏమీ లేదన్నారు, రాజేష్ మృతిలో గత రెండు నెలలుగా జరుగుతున్న ప్రతి విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చ నియాంశమైందని, వాస్తవాలు ఏమిటో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రజల ముందు ఉంచారని, వీటన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారని, అధికార దర్పంతో విర్రవీగుతున్న ఉత్తమ్ దంపతులకు రానున్న కాలంలో ప్రజాకోర్టులో శిక్ష తప్పదు అన్నారు, దేశం మొత్తం 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్న వేలకోదాడ నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగకుండా, ఉత్తమ్ దంపతుల రాజ్యాంగం అమల్లో అవుతుందా అని వారు ప్రశ్నించారు,చట్టాన్ని రాజ్యాంగాన్ని రక్షించాల్సిన పోలీసులు ఉత్తమ్ దంపతుల రాజ్యాంగానికి తలొగ్గి దళిత వర్గాలపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి లాకప్ డెత్ చేసి(చంపటం) న్యాయమా అన్నారు రాజ్యాంగ బద్ద పదవులు అనుభవిస్తున్న ఉత్తమ్ దంపతులకుఏమాత్రం రాజ్యాంగంపై నమ్మకం ఉన్న చట్టాన్ని గౌరవించి తక్షణమే వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి ఒక దళిత యువకుడు కార్ల రాజేష్ ని అక్రమంగా చిత్రహింసలు పెట్టి చంపిన ఎస్సై సురేష్ రెడ్డిని వారి ఉద్యోగాన్ని ఉన్న విలువ ఒక దళిత యువకుడి ప్రాణానికి లేదని వారు ప్రశ్నించారు, ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి ఎల్పి రామయ్య, ఎల్ నాగబాబు, గట్టు గురుమూర్తి, రాజేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: