DNB News - తెలంగాణ / : ఇకపై ప్రభుత్వ శాఖలు తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి Revanth Reddy అధికారులకు ఆదేశించారు. కాలుష్య రహిత రవాణా వ్యవస్థ లక్ష్యంగా పని చేయాలని సూచించారు. కోర్ అర్బన్ ఏరియా కింద వచ్చే ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకునే వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని స్పష్టం చేశారు. అలాగే రవాణా శాఖలో మాన్యువల్ విధానాలకు స్వస్తి చెప్పి, అన్ని కార్యకలాపాలను పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రవాణా శాఖ పనితీరుపై మంత్రి Ponnam Prabhakarతో పాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌టీవో కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగకుండా, వెంటనే సొంత భవనాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు షార్ట్ ఫిల్మ్‌లు ప్రదర్శించాలని సూచించారు. Shamshabad సమీపంలో హైస్పీడ్ రైలు కారిడార్ ప్రారంభమయ్యే ప్రాంతంలో ఆధునిక బస్ టెర్మినల్ ఏర్పాటు చేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.
Admin
DNB News