DNB News - తెలంగాణ / : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గంగమ్మ గుడి ఆలయ ప్రాంగణంలో ఆదివారం కొల్లాపూర్ తాలూకా తెలుగోళ్ళ కమిటీ కార్యవర్గ ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. 7 మండలాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు, మండలాల అధ్యక్షుల సమక్షంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి నాగర్ కర్నూల్ ఫిషరీష్ జిల్లా చైర్మన్ వాకిటి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందించారు. తాలూకా పరిధిలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన కులబంధువులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ పగిడాల శ్రీనివాస్, పెబ్బేటి కృష్ణయ్య, భయ్యా వెంకటస్వామి, సంగనమోని జమ్ములయ్య, సందు ఆంజనేయులు, బొలమోని వెంకటస్వామి, పల్లె మధు. నూతన కార్యవర్గం అధ్యక్షులు:గడ్డికోపుల శివ ప్రసాద్(సాతాపూర్–పెద్దకొత్తపల్లి) ఉపాధ్యక్షులుగా కొమ్ము ఆంజనేయులు (నర్సాయిపల్లి–కోడేరు), తెలుగు మధు (కొప్పునూరు–చిన్నంబావి) సంగనమోని వీరశేఖర్(తెల్లరాళ్లపల్లి–పానగల్), ప్రధాన కార్యదర్శిగా బొల మోని ధర్గేష్ (గోవర్ధనగిరి–వీపనగండ్ల), సహాయ కార్యదర్శులుగా పెబ్బేటి రేనయ్య(మారేడుమాను–దిన్నె), జాజాల తిరుపతయ్య (రేమొద్దుల), సంయుక్త కార్యదర్శిగా సంగనమోని రాముడు(కొండూరు), కోశాధికారిగా ఉరి హరికృష్ణ (కొల్లాపూర్) ఈ సందర్భంగా కొల్లాపూర్ తాలూకా తెలుగోళ్ళ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తాలూకా పరిధిలోని అన్ని గ్రామాల కులబంధువుల ఐక్యత, సంక్షేమం, అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.
Admin
DNB News