Wednesday, 17 June 2026 02:27:23 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – ఉచిత వైద్య శిబిరాలు ప్రారంభం

Date : 07 March 2026 04:18 PM Views : 106

DNB News - తెలంగాణ / : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ అంకిత్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్ వైద్యులు అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులచే ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ శిబిరాలను ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు ఈ వైద్య శిబిరాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి ఎక్కువ మంది ప్రజలు శిబిరాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా రక్తపరీక్షలు, కీళ్ల సమస్యలకు సంబంధించిన పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు వంటి ఆరోగ్య పరీక్షలను ప్రజలు చేయించుకొని తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు. అవసరమైతే రోగులను కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేసి అక్కడ అందుబాటులో ఉన్న అన్ని ప్రధాన పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు. కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్కానింగ్, ఎక్స్-రే వంటి పరీక్షలు అందుబాటులో ఉన్నందున అవసరమైన వారికి అక్కడ పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో ఉచిత వైద్య శిబిరాలను దశల వారీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు సుజాతనగర్, జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ప్రతిరోజు రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల చొప్పున ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరాలలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, గైనకాలజీ, డెంటల్, ఆఫ్తమాలజీ వంటి ఆరు విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పాల్గొని ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. శిబిరాలకు వచ్చే రోగులకు అవసరమైన మందులను ఉచితంగా అందజేయడంతో పాటు అవసరమైతే మెరుగైన చికిత్స కోసం పై స్థాయి ఆసుపత్రులకు రిఫర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఉచిత వైద్య శిబిరాలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించి ఎక్కువ మంది ప్రజలు ఈ సేవలను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, తాసిల్దార్ ప్రసాద్, మెడికల్ ఆఫీసర్ రమేష్, ఎంపీడీవో భారతి సంబంధిత శాఖల అధికారులు వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :