DNB News - తెలంగాణ / : మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న గణపురం గ్రామానికి చెందిన నాగం నాగేష్ శనివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. తన బైక్ పై కౌడిపల్లి వైపు వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో నాగేష్ రోడ్డు పక్కన పడిపోయాడు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో నాగేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొల్చారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేశారు . నాగేష్ మృతికి కారణమైన కారు డ్రైవర్ కోసం కొల్చారం పోలీసులు గాలిస్తున్నారు.
Admin
DNB News