DNB News - తెలంగాణ / : హైదరాబాద్‌కు చెందిన ఓ యువ కంటెంట్ క్రియేటర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మణికొండలోని చిత్రపురి కాలనీలో నివసిస్తున్న కోమలి అనే యువతి ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. వ్యక్తిగత కారణాల వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో అఖిల్ రెడ్డి అనే వ్యక్తితో ఆమెకు సంబంధం ఉన్నట్లు, సుమారు ఏడాది క్రితం ఆ సంబంధం ముగిసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఏర్పడిన మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
DNB News