DNB News - తెలంగాణ / : అశ్వరావుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో 10 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తనను గెలిపించాలని ఓటర్లు ను ప్రలోభ పెట్టి గిఫ్టులు, నగదు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఓట్లు లెక్కింపు ఫలితాలు ఉన్నందునా తాను ఓడిపోతానన్న భయంతో ఆయన ఓటర్లకు ఇచ్చిన గిఫ్ట్ లను, నగదును తిరిగి తనకి ఇవ్వాలని ఓటర్ల దగ్గరికి వెళ్లి తీసుకుంటున్నాడు. తనకు ఓటు వేయకుండా వేరే పార్టీలకు చెందిన అభ్యర్థులకు ఓట్లు వేశారని, అందుకు తాను ఇచ్చిన గిఫ్టులు, నగదు నాకు ఇవ్వాలని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. అధికార పార్టీ అండ చూసుకొని ఓటర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎన్నికల ముందు రోజు ఓటర్లకు ఇచ్చిన కుక్కర్లు, ఇతర మహిళల సామాగ్రిని మరలా ఆయన లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. మేము మాకు డబ్బులు గిఫ్టులు ఇవ్వమని ఏమైనా అడిగామా రాత్రి 10 గంటలకు వచ్చి మా తలుపులు కొట్టి మాకు డబ్బులు గిఫ్టులు ఇచ్చారు. డబ్బులు ఇస్తానంటే ఎవరికైనా చేదా ఇటువంటి నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పలువురు కోరుతున్నారు. అదేవిధంగా అశ్వరావుపేట పదో వార్డులో ఆధార్ పార్టీ అభ్యర్థి కరిష్మా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఆమెను గెలిపించేందుకు ఓటర్లు సమాయత్తం అయ్యారని, వీటిని తెలుసుకొని ఓటమి భయంతో అధికార పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఆయన ఇచ్చిన గిఫ్టులను వెనక్కు తీసుకుంటున్నాడు. ఇటువంటి నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని మేధావులు కోరుతున్నారు.
Admin
DNB News