DNB News - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్ర శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, సూపర్వైజర్స్ SPS మెడికల్ & హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.... ఈరోజు హైదరాబాదు నందు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితని కలసి తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలలో ప్రభుత్వ ఆస్పటల్ నందు పనిచేస్తున్న శానిటేషన్ , పేషంట్ కేర్ , సెక్యూరిటీ గార్డ్స్ , సూపర్వైజర్లు 17000 వేల మంది పైచిలుక కార్మికుల పనిచేస్తూ...... చాలీచాలని జీతంతో ఎన్నో ఒడిదుడుకుల మధ్య కుటుంబాల పోషణ కరువై ఇబ్బందులు పడుతున్నారు మరియు ప్రాముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఔట్సోర్సింగ్ & కాంట్రాక్ట్ కార్మికులను ఏప్రిల్ నుండి డైరెక్ట్ జీతాలు వారి వారి ఎకౌంట్లో వేసే విధంగా చేస్తున్న IFMS విధానం భాగం లో మా వ్యవస్థ లో పనిచేస్తున్న 17వేల మంది కార్మికులు లేరు అని కల్వకుంట్ల కవితకి రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కుర్రి సైదయ్య తెలియపరిచినారు. 1. కనీస వేతనాలు 26000/- ఇవ్వాలి అని 2. ప్రతి కార్మికుడిని IFMS విధానంలో తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని 3.ప్రతి కార్మికుడికి వారి వారి ఎకౌంట్లో డైరెక్ట్ గా వేతనాలు వెయ్యాలి అని 4. మహిళా కార్మికులకు వేతనములతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి అని. 5. ప్రతి కార్మికుడికి డబల్ పిఎఫ్ రద్దుచేసి సింగిల్ పీఎఫ్ మాత్రమే కార్మికుడికి కటింగ్ చేయాలి అని 6. ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ తప్పనిసరి కట్టి కార్డు ఇవ్వాలి అని 7. హాస్పటల్ నుండి డ్యూటీ అనంతరం ఇంటికి వెళ్తున్న తరుణంలో కానీ డ్యూటీకి వచ్చే తరుణంలో గాని ప్రమాదం జరిగి మరణించడం ఐదు లక్షలు ప్రభుత్వం ఇవ్వాలి అని 8. ప్రమాదం జరిగిన కుటుంబంలో ఒకరికి తప్పనిసరి ఉద్యోగం ఇవ్వాలని తదితర అంశములతో కూడిన మెమోరాండంకి SPS మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో..... ఇవ్వడం జరిగినది. మేడం ఇట్టి విషయంల గురించి క్లుప్తంగా విని తప్పనిసరి మీ యొక్క డిపార్ట్మెంట్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ తో స్వయంగా మాట్లాడుతాను మీ అందరిని IFMS లో తీసుకునే విధంగా చర్య తీసుకుంటాను అని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గొర్రె నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News