DNB News - తెలంగాణ / : ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో అవినీతి ఘటన వెలుగుచూసింది. బోథ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) టి. ప్రణయ్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద హరితహారం ప్రాజెక్టుకు నీరు సరఫరా చేసినందుకు ఫిర్యాదుదారునికి రావాల్సిన రూ. 5,09,000 బకాయి చెక్కును మంజూరు చేయడానికి రూ. 15,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో, బోథ్ రేంజ్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఎస్. పరశురాం ద్వారా ఆ లంచం మొత్తాన్ని స్వీకరిస్తుండగా, తెలంగాణ అవినీతినిరోధకశాఖ (ACB) అధికారులు ఆకస్మికంగా దాడి చేసి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా సంచలనం నెలకొంది.
Admin
DNB News