DNB News - తెలంగాణ / : ఈ రోజు విడుదలైన పదవ తరగతి ఫలితాలలో స్థానిక పారమిత ఉన్నత పాఠశాలవిద్యార్థులు ఎప్పటిలా అత్యున్నత ఫలితాలు సాధించారు. పారమిత విద్యా సంస్థ స్థాపించి 30 సంవత్సరాలైన సందర్భంగా ఈ అత్యుత్తమ ఫలితాలు యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు ఆనందాన్నిచ్చింది. ఈ ఫలితాలు పారమిత యొక్క ఒకే ఒక స్టేట్ బోర్డు బ్రాంచ్‌కు సంబంధించినవి. పారమిత స్థాపించిన మొదటి నుండి ప్రతి యొక్క విద్యార్థి ప్రతిభను మెరుగుదిద్దడం అన్నది పాఠశాల యొక్క సిద్ధాంతం. 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రతి యొక్క విద్యార్థి ప్రతిభ ముఖ్యమని పారమిత పాఠశాల మరియు యొక్కసారి చాటి చెప్పింది. 2025-26 పదవ తరగతి ఫలితాలు దీనికి అద్దం పడుతున్నాయి. ఇట్టి ఫలితాలలో రాచమల్ల ఆధ్య 583 మార్కులు , రామక కార్తికేయ 583 మార్కులు, గట్టు సంప్రీతి 582 మార్కులు సాధించగా 84 మంది విద్యార్థులు 90% పైగా, 173 మంది విద్యార్థులు 80% పైగా, 198 మంది విద్యార్థులు 70% పైగా, 99 శాతం విద్యార్థులు 60% పైగా సాధించారు. ఇట్టి ఫలితాలలో గణిత, సాంఘీక శాస్త్రం, తెలుగు లో 100 కు వంద మార్కులు ఆంగ్లం మరియు సామాన్య శాస్త్రంలో 99 మరియు హిందీలో 98 మార్కులు సబ్జెక్టు వారిగా అత్యధిక మార్కులు విద్యార్థులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్ ఇనుగంటి ప్రసాదరావు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పారమిత విధ్యాసంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకర్ రావు, రస్మిత, వినోదరావు, రాకేశ్, వి.యు.యం. ప్రసాద్, హన్మంతరావు, ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, బాలాజీ, కవిత సమన్వయకర్త శ్రీనాథ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాలకు ఉత్తమ సహాకారాన్ని అందించిన తల్లిదండ్రులకు ఛైర్మన్ ఇనుగంటి ప్రసాదరావు కృతజ్ఞతలు తెలియజేసారు.
Admin
DNB News