DNB News - తెలంగాణ / : మునగాల:- ఈనెల 11న రాత్రి సమయంలో ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన న్యాయవాది మిర్యాల మంగయ్య గౌడ్, ను కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య, మరియు సీనియర్ న్యాయవాదులు తమ్మినేని హనుమంతరావు, గట్ల నర్సింహారావు, బెల్లంకొండ గోవర్ధన్,చెన్న పెద్దఅబ్బాయ్ లు మునగాల లో తన నివాసంలో పరమార్శించినారు.ఈసందర్భంగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య మాట్లాడుతూ న్యాయవాదులు,వాహనదారులు ఎవరైనా తమ పనిలో భాగంగా ప్రయాణించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంగయ్య గౌడ్, హెల్మెంట్ ధరించడం వలన తలకు గాయాలు కాకుండా పెనుప్రమాదం నుండి తప్పించుకున్నారని,చేతికి,కాలికి గాయాలతోబయటపడ్డారన్నారు.అతనికి టక్కరించిన గుర్తుతెలియని కారు ఆచూకీ ని కనుగొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను కోరారు.మంగయ్య గౌడ్ కు బార్ అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.
Admin
DNB News