Wednesday, 17 June 2026 01:40:15 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి జిల్లా కో ఆర్డినేటర్ చైతన్య

Date : 01 May 2026 02:48 PM Views : 30

DNB News - తెలంగాణ / : మునగాల మండల కేంద్రంలోని నర్సింహాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కూలీలలకు మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం వారి ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో భాగంగా జిల్లా కో ఆర్డినేటర్ చైతన్య మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ అందిస్తున్న సేవలను వివరించడం జరిగింది. అదేవిధంగా మహిళా చట్టలపై అవగాహనా అవసరం అని పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల చట్టం పై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేసినట్లయితే పోక్సో చట్టం ద్వారా కేసు నమోదు చేస్తారని గ్రామంలో బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన భాద్యత అందరిపై ఉందని తెలియచేసారు గ్రామ బాల్య వివాహ నిర్ములనపై సర్పంచ్ గారిచే కమిటీ ఏర్పాటు చేయబడుతుందని కాబట్టి సర్పంచ్ బాల్య వివాహాలు లేని గ్రామంగా తీర్చిదిద్దాలని కోరడం జరిగింది. మహిళలు ఆర్థికంగా ఎదిగినపుడే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది అన్నారు. మహిళలు అన్ని రంగాలలో రానించాలని అన్నారు. మరియు గర్భస్థ లింగ నిర్దారణ చేసి ఆడపిల్లలను చంపడం నేరమని అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి అన్నారు అక్రమ దత్తతలు కూడా ప్రోత్సహించవద్దు అని దత్తత కావలసిన వారు ప్రభుత్వం ద్వారా కారా వెబ్సైటు లో కానీ బాల రక్షణ సమితి వారి ఆధ్వర్యంలో తీసుకోవాలని సూచించారు అదేవిదంగా మహిళలకు గృహహింస మరియు వేధింపులకు గురి ఐతే సఖి కేంద్రాన్ని వెళ్ళవచ్చు అని అక్కడ ఐదు సర్వీసులతో మహిళలకు సహాయం అందిస్తారని చెప్పారు. తదుపరి గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ ఇలాంటి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని. ముఖ్యంగా మహిళలు . ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా. ఎదగాలని. ఏదైనా సమస్యలు ఇబ్బందులు. వివక్షకు గురైనప్పుడు. ధైర్యంగా. ఎదుర్కొవాలని. చట్ట ప్రకారం. న్యాయ స్థానముల ద్వారా. న్యాయం పొందవచ్చని .. అలాగే. వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని .. అధికారులు తాత్సారం చేయకుండా ‌‌. వారికి సత్వర న్యాయం చేసి. వారికి అండగా నిలవాలని. అలాగే మహిళలకు. పూర్తిస్థాయిలో రక్షణ కల్పించేలా. చర్యలు చేపట్టాలని. అన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. ఉప సర్పంచ్ రెడ్డబోయిన ప్రశాంత్. పంచాయితీ సెక్రెటరీ వెంకటేశ్వర్లు మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ వినోద్, భవ్య, ఫీల్డ్ అసిస్టెంట్ ముతయ్య తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: