Monday, 15 June 2026 01:50:49 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

మణుగూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 34 మంది విద్యార్థులు అస్వస్థత

Date : 10 March 2026 10:54 AM Views : 52

DNB News - తెలంగాణ / : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అనుమానంతో కలకలం రేగింది. హాస్టల్‌లో భోజనం చేసిన అనంతరం సుమారు 34 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆదివారం కావడంతో హాస్టల్‌లో విద్యార్థులకు మటన్‌తో ప్రత్యేక భోజనం వడ్డించారు. అయితే భోజనం చేసిన కొద్దిసేపటికే కొందరు విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స కోసం తరలించారు. వీరిలో నలుగురు విద్యార్థులను మణుగూరులోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మిగతా విద్యార్థులను కూడా వైద్యులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మటన్ భోజనం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నప్పటికీ దీనిపై ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ వెలువడలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హాస్టల్‌లో అందించే ఆహార నాణ్యతపై సమగ్రంగా దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :