Monday, 15 June 2026 02:04:52 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

అక్షర సేవకు జాతీయ గుర్తింపు అక్షర ప్రవీణ పురస్కారం అందుకున్న సూర్యాపేట కవి పోతుగంటి వీరాచారి

Date : 23 January 2026 11:53 AM Views : 73

DNB News - తెలంగాణ / : తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, కళల పరిరక్షణకు అంకితమై నిరంతరం అక్షర సేవ చేస్తున్న సూర్యాపేట వాసి ప్రముఖ కవి, రచయిత, సామాజిక కార్యకర్త డాక్టర్ పోతుగంటి వీరాచారికి అక్షర ప్రవీణ జాతీయ ప్రతిభా పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సాహితీ సాంస్కృతిక పట్టాభిషేక మహోత్సవంలో ఘనంగా అందజేశారు. శ్రీశ్రీ కళావేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ అవార్డ్స్, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో, డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో ప్రాచీన కవుల వారసులచే ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యంలో విశేష సేవలందించిన కవులు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులను జాతీయ ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేశారు.ఈ సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ, సాహిత్యానికి ప్రాధాన్యత తగ్గుతున్న ఈ కాలంలోనూ అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సామాజిక చైతన్యం కోసం డాక్టర్ పోతుగంటి వీరాచారి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం అధ్యక్షతన జరిగిన సభలో, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి పార్థసారథి, ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళ కమాండెంట్ డాక్టర్ కొండా నర్సింహారావు పాల్గొన్నారు. అలివేలు మంగ దేవి దంపతులు, శ్రీనాథ మహాకవి వారసుడు కావూరి శ్రీనివాసశర్మ, కంచర్ల గోపన్న వారసుడు శ్రీనివాసరావు, ఏనుగు లక్ష్మణ కవి వారసుడు శివప్రసాద్ గార్ల చేతులమీదుగా డాక్టర్ పోతుగంటి వీరాచారికి అక్షర ప్రవీణ పురస్కారం, మెమొంటో, ప్రశంస పత్రం, దుశ్శాలువా, పూలదండతో ఘనంగా సన్మానం నిర్వహించారు.సమావేశానంతరం డాక్టర్ కొండా నర్సింహారావు మాట్లాడుతూ, నిజమైన సాహిత్యాన్ని సృజించే కవులకు ప్రాచీన కవులు పొందిన గౌరవాన్ని ఈ కాలంలోనూ కల్పించాలనే లక్ష్యంతో శ్రీశ్రీ కళావేదిక చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం మాట్లాడుతూ, అక్షరాన్ని గౌరవించే కవితా బంధువుల ఆత్మీయ స్నేహ బంధమే శ్రీశ్రీ కళావేదిక అని, తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు రెండు వందల యాభై మంది కవులు పాల్గొన్నారు. ఈ పురస్కారం అందుకున్న డాక్టర్ పోతుగంటి వీరాచారిని సాహితీవేత్తలు, బంధుమిత్రులు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :