Monday, 15 June 2026 02:28:06 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్ ప్రారంభించిన పోలీసు కమిషనర్

Date : 08 April 2026 04:16 PM Views : 39

DNB News - తెలంగాణ / : స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఖమ్మం పోలీస్ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా సిటీ అర్ముడ్ పోలీస్ హెడ్ క్వాటర్స్ ఆవరణలోని ఇటీవల ప్రారంభమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అత్యాధునిక హంగులతో నూతనంగా నిర్మితమైన షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్ ను బుధవారం పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ...పోలీస్ కుటుంబాల కోసం ఆధునిక సౌకర్యాలు, శిక్షణ, కోచింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మానసిక ఉల్లాసంతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. అదేవిదంగా శారీరక దారుఢ్యం కోసం షటిల్ బ్యాడ్మింటన్ కోర్టును పోలీసు సిబ్బందికి అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఇటువంటి సౌకర్యాలను కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామాని అన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణంలో అహర్నిశలు కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందిస్తూ ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు (ఏఆర్) కుమారస్వామి, విజయబాబు, ఏఆర్ ఏసిపి లు సుశీల్ సింగ్, నర్సయ్య, ఎస్బి ఏసిపి మహేష్, సిసిఎస్ ఏసీపీ సర్వర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కామరాజు, శ్రీశైలం,సాంబశివరావు సురేష్, నాగుల్ మీరా, ఇన్స్పెక్టర్లు రాజిరెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :