Wednesday, 17 June 2026 03:04:41 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

శాతవాహనలో ఆంగ్లభాషా దినోత్సవం

Date : 24 April 2026 10:16 AM Views : 37

DNB News - తెలంగాణ / : శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల విభాగంలో ప్రఖ్యాత రచయిత షేక్స్పియర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంగ్లభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి సభాధ్యక్షత వహించిన విభాగాధిపతి డాక్టర్ విజయప్రకాశ్ మాట్లాడుతూ ఆంగ్ల విభాగం తరఫున భాషా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆవశ్యకరమని విలియం షేక్స్పియర్ 16వ శతాబ్దం నుండి ఇప్పటివరకు తన సాహిత్యంతో ప్రభావితం చేశారని, ఆంగ్ల భాషలో దాదాపు 2,000 కొత్త పదాలను కనుగొన్నారని అయన రచనలు సమాజంలో మానవత్వాన్ని ప్రేమను మానవులలోని అన్ని రకాల గుణగణాలను తెలియజేశారని ఆయన ఉపయోగించిన భాషను, ప్రత్యేకమైన పదాలుగా విరివిగా ఉపయోగిస్తున్నారని తెలియజేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ రిజిస్టార్ ఆచార్య సతీష్ కుమార్ మాట్లాడుతూ ఆంగ్ల భాష నేడు ప్రపంచంలోనే ఒక ప్రముఖమైన భాషగా అవతరించిందని దాదాపు రెండు బిలియన్ల మంది ఇంగ్లీష్ భాషను మాట్లాడుతున్నారని షేక్స్పియర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంగ్ల భాషా దినోత్సవం గా జరుపుకోవడం గొప్ప విషయమని షేక్స్పియర్ రచనలు పరీక్షల కోసమే కాకుండా సమాజంలో మానవ ప్రవర్తనలో మార్పులు తీసుకురావడానికి వినియోగించుకోవాలని నేటితరంలో ఆంగ్ల భాషకు విశిష్టమైన స్థానం ఉన్నదని అన్ని రంగాలలో కూడా ఆంగ్ల భాషను విరివిగా ఉపయోగిస్తున్నారని, ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సంపాదించినట్టయితే సగం ప్రపంచాన్ని గెలిచినట్టేనని విద్యార్థులు ఆంగ్ల భాష పై పట్టు సాధించి ప్రపంచాన్ని గెలవడానికి ముందుకు వెళ్లాలని సూచించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె పద్మావతి మాట్లాడుతూ షేక్స్పియర్ జన్మదినాన్ని కేవలం జరుపుకోవడమే కాకుండా ఆయన నేర్పిన మానవతా విలువలు భాషా సూత్రాలను నేటి సమాజానికి అనుగుణంగా మార్పులు చేసుకొని ముందుకు సాగాలని, ఆంగ్ల భాషను విరివిగా ఉపయోగించడం ద్వారా అన్ని రకాల ఇబ్బందులను అధిగమించుకోవచ్చు అని నేటి సాంకేతిక యుగములో ఆంగ్లభాషకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నదని తెలియజేశారు. పూర్వ ఆంగ్ల భాష విభాగాధిపతి డా. ప్రదీప్ మాట్లాడుతూ షేక్స్పియర్ రచించిన నాటకాలు నిజంగా జీవితాలను పరివర్తన చేయడానికి ఉపయోగపడతాయని ఆయన రాసిన రచనలు సమాజంలో నేటికీ కీలకంగా మారాయని విద్యార్థులు షేక్స్పియర్ ని మర్చిపోకూడదని తెలియజేశారు. ఈ భాషా దినోత్సవం లో భాగంగా విద్యార్థులకు షేక్స్పియర్ సాహిత్యం పై వివిధ రకాల కాంపిటీషన్స్ నిర్వహించి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆంగ్ల విభాగ అధ్యాపకులు డాక్టర్ జోస్లీన, హరికృష్ణ ఆంగ్ల విభాగ ప్రధమ ద్వితీయ సంవత్సర విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఆంగ్లభాషా దినోత్సవాన్ని విజయవంతం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: