DNB News - తెలంగాణ / : తెలంగాణలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు వరంగల్, కొత్తగూడెం, రామగుండం ఎయిర్పోర్ట్లకు అనుమతులు రాగా, తాజాగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు కూడా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎంపీ గోడం నరేష్ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ను విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభమవుతాయని, ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కోసం మరో 10 వేల ఎకరాలను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
Admin
DNB News