Monday, 15 June 2026 01:54:27 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

అర్జీ ఏదైనా.. పరిష్కారం పక్కా! - మూడు నెలల్లోగా పెండింగ్‌ సమస్యలన్నీ క్లియర్

Date : 30 April 2026 11:31 AM Views : 33

DNB News - తెలంగాణ / : ఖమ్మం రూరల్: ప్రజా ప్రభుత్వం ప్రజల ముంగిటకే వచ్చిందని, ప్రజలు ఇచ్చే ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్‌’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గడువులోగా పరిష్కారం.. అధికారులకు ఆదేశం ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. "సాధారణ సమస్యలను వారం రోజుల్లోనే పరిష్కరించాలని అధికారులకు సూచించాం. ఇక ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలకు గరిష్టంగా 3 నెలల గడువు విధిస్తున్నాం. ఈలోపు ప్రతి దరఖాస్తుకు ఒక స్పష్టమైన పరిష్కారం చూపడమే మా లక్ష్యం" అని ప్రకటించారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సాధాబైనామా సమస్యలను 45 రోజుల్లోనే కొలిక్కి తెస్తామని కీలక ప్రకటన చేశారు. పేదల సొంతింటి కల.. మా బాధ్యత గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇళ్లు లేక ఇబ్బంది పడ్డ పేదలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశాం. ప్రతి సోమవారం బిల్లులు విడుదల చేస్తూ పారదర్శకత పాటిస్తున్నాం అని తెలిపారు. త్వరలోనే రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుడతామన్నారు. రూరల్ మండల పరిధిలోని 12 గ్రామాల్లో గత రెండున్నరేళ్లలో రూ.386 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. అన్నదాతకు వెన్నుదన్నుగా.. రైతుల సంక్షేమంలో తమ ప్రభుత్వం రాజీ పడదని మంత్రి స్పష్టం చేశారు. రూ. 20,656 కోట్లతో 25 లక్షల మందికి రైతు రుణమాఫీ పూర్తి చేశామని, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తున్నామని గుర్తు చేశారు. కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్ల కోసం వేచి చూస్తున్న అర్హులకు త్వరలోనే శుభవార్త చెబుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, విద్యుత్, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖల చీఫ్ ఇంజనీర్లు, జిల్లా స్థాయి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :