DNB News - తెలంగాణ / : మునగాల మండల కేంద్రంలోని నర్సింహాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కూలీలలకు మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం వారి ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో భాగంగా జిల్లా కో ఆర్డినేటర్ చైతన్య మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ అందిస్తున్న సేవలను వివరించడం జరిగింది. అదేవిధంగా మహిళా చట్టలపై అవగాహనా అవసరం అని పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల చట్టం పై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేసినట్లయితే పోక్సో చట్టం ద్వారా కేసు నమోదు చేస్తారని గ్రామంలో బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన భాద్యత అందరిపై ఉందని తెలియచేసారు గ్రామ బాల్య వివాహ నిర్ములనపై సర్పంచ్ గారిచే కమిటీ ఏర్పాటు చేయబడుతుందని కాబట్టి సర్పంచ్ బాల్య వివాహాలు లేని గ్రామంగా తీర్చిదిద్దాలని కోరడం జరిగింది. మహిళలు ఆర్థికంగా ఎదిగినపుడే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది అన్నారు. మహిళలు అన్ని రంగాలలో రానించాలని అన్నారు. మరియు గర్భస్థ లింగ నిర్దారణ చేసి ఆడపిల్లలను చంపడం నేరమని అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి అన్నారు అక్రమ దత్తతలు కూడా ప్రోత్సహించవద్దు అని దత్తత కావలసిన వారు ప్రభుత్వం ద్వారా కారా వెబ్సైటు లో కానీ బాల రక్షణ సమితి వారి ఆధ్వర్యంలో తీసుకోవాలని సూచించారు అదేవిదంగా మహిళలకు గృహహింస మరియు వేధింపులకు గురి ఐతే సఖి కేంద్రాన్ని వెళ్ళవచ్చు అని అక్కడ ఐదు సర్వీసులతో మహిళలకు సహాయం అందిస్తారని చెప్పారు. తదుపరి గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ ఇలాంటి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని. ముఖ్యంగా మహిళలు . ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా. ఎదగాలని. ఏదైనా సమస్యలు ఇబ్బందులు. వివక్షకు గురైనప్పుడు. ధైర్యంగా. ఎదుర్కొవాలని. చట్ట ప్రకారం. న్యాయ స్థానముల ద్వారా. న్యాయం పొందవచ్చని .. అలాగే. వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని .. అధికారులు తాత్సారం చేయకుండా . వారికి సత్వర న్యాయం చేసి. వారికి అండగా నిలవాలని. అలాగే మహిళలకు. పూర్తిస్థాయిలో రక్షణ కల్పించేలా. చర్యలు చేపట్టాలని. అన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. ఉప సర్పంచ్ రెడ్డబోయిన ప్రశాంత్. పంచాయితీ సెక్రెటరీ వెంకటేశ్వర్లు మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ వినోద్, భవ్య, ఫీల్డ్ అసిస్టెంట్ ముతయ్య తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News