Monday, 15 June 2026 02:07:22 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

తెలంగాణలో సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం

Date : 17 March 2026 03:59 PM Views : 53

DNB News - తెలంగాణ / : తెలంగాణలో సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 24 ఏళ్ల తర్వాత… ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. సుప్రీంకోర్టు తుది తీర్పు మేరకు… నాంపల్లి కోర్టు లో లొంగిపోయారు. ఇన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడిన సిద్ధార్థ్ రెడ్డి… ఇటీవలే భారత్‌కు వచ్చి కోర్టులో హాజరయ్యారు. 2002 ఫిబ్రవరి 23న జరిగిన ఈ ఘటనలో… కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగిన ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి… ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా, సిద్ధార్థ్ రెడ్డి కోలుకున్నారు. ప్రత్యూషది ఆత్మహత్య కాదని… హత్యేనంటూ ఆమె తల్లి సుదీర్ఘకాలం న్యాయపోరాటం సాగించారు. ఈ కేసులో సిద్ధార్థ్ రెడ్డి ప్రేరేపణ కారణంగా ఆత్మహత్య జరిగిందన్న అభియోగాలపై… ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే అనంతరం హైకోర్టు శిక్షను రెండేళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా… సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు పిటిషన్‌ను కొట్టేసింది. అదేవిధంగా… నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించిన సుప్రీంకోర్టు… ఆ ఆదేశాల మేరకు సిద్ధార్థ్ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ఈ పరిణామంతో… చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో కీలక మలుపు ఏర్పడింది

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :