Wednesday, 17 June 2026 01:36:36 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మీకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ డిమాండ్

Date : 24 April 2026 05:43 PM Views : 67

DNB News - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మీకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కరీంనగర్ లో శుక్రవారం రోజు ఆర్టీసీ జేఏసి కార్మీకుల కు మద్దతు తెలుపారు. ఆర్టీసీ డిపో వద్ద కార్మీకులతో కలిసి ఆంధోళన పాల్గొని నిరసన తెలిపారు. కార్మీకులకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు బస్టాండ్ నుండి కార్మీకులతో కలిసి అమరవీరుల స్థూపం వరకు మేయర్ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ...సంతాపం ప్రకటించారు. ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ....ఆర్టీసిని ప్రభుత్వం లో విలీనం చేస్తూ... కార్మీకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసి కార్మీకుల బకాయి ఉన్న వేతన సవరణలను వెంటనే అమలు చేయాలని చేయాలన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మీకులను పట్టించుకొక పోవడం వల్లే ఆత్మహత్యలు చేస్కోవల్సిన పరిస్తితి ఏర్పడిందని ద్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మీకులు చేస్తున్న న్యాయపోరాటానికి బీజేపి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రబుత్వ మొండి వైఖరి వల్లే నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందడం జరిగిందని... దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించి డిమాండ్ల నెరవేర్చాలన్నారు. ఆర్టీసీ కార్మీకుల పీఆర్సీని వెంటనే ప్రకటించాలన్నారు. ఆర్టీసీని బలోపేతం చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు కొత్త బస్సులను కోనుగోలు చేయాలన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ అద్దెబస్సులను నడుపుతూ కార్మీకులకు తీరని అన్యాయం చేస్తుందని.. వెంటనే నడిపిస్తున్న అద్దె బస్సులను తగ్గించాలన్నారు. 30 శాతం ఫిట్ మెంట్ తగ్గకుండా 2021 వేతన సవరణలను వెంటనే చేపట్టి ఆర్టీసీ జేఏసి కార్మీకులు తీస్కున్న సమ్మెను విరమింప చేయాలన్నారు ఆర్టీసీ జేఏసి ప్రభుత్వం ముందు ఉంచిన 32 న్యాయమైన డిమాండ్ల పై కార్మీక సంఘాలతో సానుకూలంగా చర్చలు జరిపి వాటిని నెరవేర్చే దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీసి సంస్థలో నూతన రిక్రూట్ మెంట్ చేపట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మీకుల హక్కుల కోసం పోరాటం చేసే వారికి మద్దతు తెలిపి వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీస్కోవాలన్నారు. గుర్తింపు పొందిన కార్మీక సంఘాల యూనియన్లను వెంటనే ప్రారంబించాలన్నారు. యూనియన్ల ద్వారానే వారి సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి... యూనియన్లతో ప్రభుత్వం చర్చలు జరిపి... వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ మొండి వైఖరిని వీడి సమ్మెలో ఉన్న 39 వేల మంది కార్మీకులతో తక్షణమే చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం సానుకూలంగా చర్చలు జరపకుండా... సమస్యలను పరిష్కరించ కుండా కార్మీకులను బెదింపులకు గురి చేయడం ముర్ఖత్వమని మండి పడ్డారు. ఇప్పటికైన చర్చలు జరిపి... వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని... సమ్మెను విరమింపజేసేలా చర్యలు తీస్కోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు చంద్ర, దేవసాని సరస్వతి, మాసం గణేష్, తోట అనిల్ మరియు ఆర్టీసీ యూనియన్ నాయకులు, కార్మీకులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: