DNB News - తెలంగాణ / : నేడు మండల పరిధిలోని నరసింహపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తదుపరి సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని. ఆయన భారతీయ సామాజిక కార్యకర్త. వ్యాపారవేత్త. విప్లవకారుడని. కుల వ్యతిరేక సంఘసంస్కర్తని . కుల నిర్మూలన కోసం సమ సమాజ స్థాపన కోసం విశేషంగా కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త అని. ఆయన భారత దేశ బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తని . అలాగే వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించారని విద్య యొక్క విస్వీకరణను సమర్ధించిన మొదటి సంస్కర్త కూడా ఆయనేనని .. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1888 సంవత్సరంలోనే మహాత్మా అని బిరుదు ప్రదానం చేశారని. దేశం గర్వించదగ్గ మహోన్నతమైన. వ్యక్తిత్వం గల మహానీయుడని. కొనియాడారు ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రెడ్డబోయిన ప్రశాంత్ వార్డ్ సభ్యులు. షేక్ అజీజ్ మియా. గ్రామ పెద్దలు బొమ్మ చిన్న వెంకన్న . కారంగుల సైదులు దళిత నాయకులు రేవూరి బాబు మీసాల రామ్మూర్తి .. గ్రామస్తులు. చెర్వుపల్లి శ్రీను వీరబోయిన వీరాస్వామి. నారయ్య బొమ్మ అంజయ్య . శ్రీను గుండు కరుణాకర్ . రామస్వామి వెంకీ. విజయ్ . వెంకటేశ్వర్లు రామయ్య గారు. నాగయ్య గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News