Saturday, 18 April 2026 02:05:20 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

రబీ సీజన్ ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేయాలి.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

యూరియా పంపిణీ పకడ్బందీగా చేయాలి

Date : 02 February 2026 04:53 PM Views : 54

DNB News - తెలంగాణ / : రబీ సీజన్ ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో రబీ ధాన్య సేకరణ, యూరియా పంపిణీ, మునిసిపల్ ఎన్నికలు, జిల్లా అధికారుల హాజరు లపై అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, రబీ సీజన్ దిగుబడి అంచనాలకు తగ్గట్టు కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. గత అనుభవాలను దృష్టికి పెట్టుకొని, సమస్యలను అధిగమించాలన్నారు. గత ధాన్య సేకరణలో ఎదురైన సమస్యలు, సమస్యలు అధిగమించడానికి పరిష్కార చర్యలతో సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. మిల్లర్లకు కొనుగోలుపై ముందే అవగాహన కల్పించాలని, సమస్యలుంటే ముందుగానే పరిష్కరించాలని అన్నారు. ధాన్య కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అన్నారు. యూరియా పంపిణీ వంద శాతం యాప్ ద్వారా జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు యూరియా పంపిణీ పై నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. యూరియా నిల్వల గురించి అడిగి తెలుసుకున్నారు. యూరియా కొరత ఉంటే ముందస్తుగానే తెలపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మునిసిపల్ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ స్టాఫ్ శిక్షణ కు ఏర్పాట్లు చేయాలన్నారు. సిబ్బంది ఎన్నికల విధుల మినహాయింపుకు అధికారులు సిఫారసు చేస్తే, ప్రత్యామ్నాయ సిబ్బందిని, ఆయా అధికారులే సూచించాలన్నారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో షాపులు కోల్పోయిన వారితో మాట్లాడి, స్థలం గుర్తించి, ఒక స్ట్రీట్ వెండర్ జోన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. దానవాయిగూడెం బాలికల సాంఘీక సంక్షేమ హాస్టల్ వరదల్లో దెబ్బతినగా, వసతుల కల్పన కు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ప్రతిపాదిత అన్ని పనులు పూర్తి అయ్యేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ఎంఓఎంబి లో మిగులు పాఠశాలల పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులు తమ క్షేత్ర పర్యటనలు కొనసాగించాలన్నారు. పాఠశాల, హాస్టళ్ల సందర్శన, భోజన నాణ్యత పరిశీలన, పురోగతి లో ఉన్న ప్రభుత్వ ప్రాధాన్యత పనుల పర్యవేక్షణ, ధాన్య కొనుగోలు పర్యవేక్షణ లు చేయాలన్నారు. అధికారుల క్షేత్ర సందర్శనల సమీక్ష చేయనున్నట్లు కలెక్టర్ అన్నారు. సిబ్బంది హాజరు మెరుగవ్వాలన్నారు. అధికారులు సిబ్బంది హాజరుపై సమీక్షించాలన్నారు. అనుమతి లేని గైర్హాజారుపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం నుండి సరఫరా అయిన హ్యాండ్ హెల్డ్ ఎక్స్ రే పరికరాన్ని కలెక్టర్ ప్రారంభించి, వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించారు. ఈ సమీక్ష లో జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. రామారావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, అదనపు వైద్య ఆరోగ్య అధికారి డా. చందునాయక్, డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్, జిల్లా టిబి నియంత్రణ అధికారి డా. సుబ్బారావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :