DNB News - తెలంగాణ / : ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ వార్డులో సీపీఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బెందు జ్యోతి కారు గుర్తి పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ : కాంగ్రెస్ పార్టీ దొంగ 420 హామీలతో ప్రజలను నమ్మించి మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఫెయిలయ్యారు.! గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మనలను మోసం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల పక్షాన నిలిచిన గొప్ప నాయకుడు "కేసీఆర్" గారు. రైతులకు రైతు బంధు,రైతుభరోసా పథకం ఇచ్చి రైతుకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు కేసీఆర్ గారు అని ప్రజలకు తెలియజేశారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్లు వస్తె ప్రభుత్వ దొంగ హామీలను నిలదీసి ప్రశ్నించాలని దిశానిర్దేశం చేశారు.
Admin
DNB News