Monday, 15 June 2026 01:56:43 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం రామవరం ప్రజల భారీ అవగాహన ర్యాలీ

Date : 12 March 2026 04:27 PM Views : 88

DNB News - తెలంగాణ / : కొత్తగూడెం రామవరం ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం భాగంగా పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట, డ్రగ్స్ రహిత తెలంగాణ మన అందరి బాధ్యత అనే నినాదంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామవరం ప్రాంతానికి చెందిన ప్రజలు, యువకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మానవహారం ఏర్పాటు చేసి భారీ ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నినాదాలు చేస్తూ యువతలో చైతన్యం కల్పించారు. అనంతరం ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. రామవరం గణేష్ టెంపుల్ చమన్ వద్ద జరిగిన అవగాహన సదస్సులో 2 టౌన్ సీఐ డి ప్రతాప్ మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో యువత మత్తు పదార్థాలకు బానిసవుతున్న పరిస్థితి ఆందోళనకరమని పేర్కొన్నారు. డ్రగ్స్ వల్ల వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం కూడా తీవ్రంగా నష్టపోతాయని తెలిపారు. యువత మంచి లక్ష్యాలతో ముందుకు సాగి దేశ అభివృద్ధికి తోడ్పడాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈగల్ టీం ఇన్‌స్పెక్టర్ రవీందర్ మాట్లాడుతూ డ్రగ్స్ రకాల గురించి, వాటిని ఎలా గుర్తించాలో, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మత్తు పదార్థాల వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతింటున్నాయని వివరించారు. కార్యక్రమం అనంతరం పోలీసుల తరఫున పిల్లలకు క్రికెట్ బ్యాట్లు, బాల్స్ మరియు క్రీడా కిట్లు అందజేశారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని, క్రీడలు మానసిక ధైర్యాన్ని పెంచడంతో పాటు మెదడు చురుకుదనాన్ని పెంపొందిస్తాయని పోలీసులు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్, హైస్కూల్ హెడ్‌మాస్టర్, అంగన్‌వాడీ టీచర్లు, మహిళలు, యువకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వచ్ఛమైన సమాజం – సురక్షిత భవిష్యత్తు కోసం డ్రగ్స్‌కు నో చెప్పాలి అని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :