DNB News - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌తో పాటు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం కింద అదనపు తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాలను డ్రగ్స్, గంజాయి విక్రయాల హాట్‌స్పాట్స్‌గా గుర్తించిన అధికారులు అక్కడ నిఘాను మరింత పెంచారు. ముఖ్యంగా ధూల్‌పేట్, నారాయణగూడ, ఫతేనగర్, సీతాఫల్‌మండి, నేరేడ్‌మెట్, షేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మూసాపేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్, ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో ప్రత్యేక దాడులు కొనసాగుతున్నాయి. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్‌పోస్టులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో కూడా ఎక్సైజ్ బృందాలు తనిఖీలను మరింత కఠినంగా నిర్వహిస్తున్నాయి. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గత సంవత్సరం నిర్వహించిన దాడుల్లో పెద్ద మొత్తంలో గంజాయి మరియు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్, ఎన్‌డీపీఎల్ మద్యం రవాణాపై నిరంతరం నిఘా కొనసాగుతోందని చెప్పారు. ప్రజా పాలన కార్యక్రమం కింద దాడులను మరింత ముమ్మరం చేసి రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మరియు అక్రమ మద్యం రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం వెల్లడించారు.
Admin
DNB News