Monday, 15 June 2026 01:53:12 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

వాట్సాప్ ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాలు అందుబాటులోకి

Date : 11 April 2026 04:19 PM Views : 39

DNB News - తెలంగాణ / : రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ సేవల విస్తరణ వేగంగా కొనసాగుతోంది. ప్రజలకు సులభంగా, వేగంగా ప్రభుత్వ సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్ ప్రస్తుతం 580కు పైగా సేవలను అందిస్తూ రాష్ట్రంలో ప్రముఖ డిజిటల్ సేవా వేదికగా నిలుస్తోంది. 2025 నవంబర్ 18న ప్రారంభమైన ఈ సేవలు తక్కువ సమయంలోనే విస్తృతంగా ప్రజాదరణ పొందాయి. ప్రజలు 8096958096 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సందేశం పంపడం ద్వారా వివిధ ప్రభుత్వ సేవలను సులభంగా పొందవచ్చు. తాజాగా ఈ సేవల్లో భాగంగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష ఫలితాలను వాట్సాప్ ద్వారా పొందే సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏప్రిల్ 12, 2026 నుండి విద్యార్థులు తమ ఫలితాలను నేరుగా వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. ఈ విధానంతో వెబ్‌సైట్‌లలో లాగిన్ కావడం లేదా మీ సేవ కేంద్రాలను సందర్శించడం అవసరం ఉండదు. ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ మరియు ఎస్సెస్సీ హాల్ టికెట్లను ఉచితంగా, తక్షణం అందించిన ఈ ప్లాట్‌ఫామ్, విద్యార్థులకు మరింత సౌలభ్యం కల్పిస్తోంది. విద్యార్థులు తమ ఫలితాలను పొందేందుకు ముందుగా 8096958096 నంబర్‌ను “MeeSeva Telangana”గా సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో “Hi” మెసేజ్ పంపాలి. అనంతరం “BIE Exam Result” సేవను ఎంపిక చేసి, తమ రోల్ నంబర్, సంవత్సరం (1వ లేదా 2వ సంవత్సరం), స్ట్రీమ్ (జనరల్ లేదా వొకేషనల్) వివరాలను నమోదు చేసి సమర్పిస్తే, ఫలితం వెంటనే వాట్సాప్‌లో అందుతుంది. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మీ సేవ వాట్సాప్ సేవలు ప్రజలు ప్రతిరోజూ వినియోగించే డిజిటల్ వేదికల ద్వారా ప్రభుత్వ సేవలను ప్రతి ఇంటికి చేరవేసే వినూత్న చర్యగా నిలుస్తున్నాయని తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :