Saturday, 18 April 2026 02:28:31 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

హైదరాబాద్‌లో హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు

Date : 10 March 2026 06:15 PM Views : 40

DNB News - తెలంగాణ / : చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, అంబర్‌పేట్ పోలీసులతో కలిసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, అంబర్‌పేట్ పరిధిలోని అలీ కేఫ్ క్రాస్ రోడ్ వద్ద ముగ్గురు వ్యక్తులు తుపాకీతో సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక దేశీయ తయారీ తుపాకీ, ఆరు లైవ్ రౌండ్లు, ఒక మ్యాగజైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక ఎలక్ట్రిక్ స్కూటీ, మూడు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులు మల్కాజిగిరికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ధమరా అరుణ్ కుమార్, జవహర్ నగర్‌కు చెందిన పాన్ షాప్ నిర్వహిస్తున్న మహ్మద్ అబ్బు, యాకుత్‌పురాకు చెందిన విద్యార్థి మీర్ ముజమ్మిల్ అలీ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ధమరా అరుణ్ కుమార్ తన రెండో భార్యపై అనుమానం పెంచుకుని ఆమెను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు తన బంధువుతో అక్రమ సంబంధం ఉందని అనుమానంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. దీంతో అరుణ్ కుమార్ గత సంవత్సరం నవంబర్‌లో మహ్మద్ అబ్బును సంప్రదించి తుపాకీ ఏర్పాటు చేయాలని కోరాడు. అబ్బు, మీర్ ముజమ్మిల్ అలీ ఖాన్‌ను పరిచయం చేయగా, ముజమ్మిల్ తుపాకీని ఏర్పాటు చేస్తానని చెప్పి ముందుగా 20 వేల రూపాయలు తీసుకున్నాడు. తర్వాత ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ముజమ్మిల్ తన బంధువు సలామత్‌తో కలిసి బీహార్ రాష్ట్రంలోని ముంగేర్‌కు వెళ్లి తబీష్ అనే వ్యక్తి వద్ద నుంచి 35 వేల రూపాయలకు ఒక దేశీయ తుపాకీ, పది లైవ్ రౌండ్లు, రెండు మ్యాగజైన్‌లు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వాటిని అరుణ్ కుమార్‌కు ఇచ్చి ఒక లక్ష పది వేల రూపాయలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల అరుణ్ కుమార్ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గొల్లగూడెం గ్రామంలో ఉన్న తన వ్యవసాయ భూమిలో తుపాకీతో రెండు రౌండ్లు కాల్చి ప్రాక్టీస్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఒక మ్యాగజైన్‌ను అక్కడే కోల్పోయినట్లు వెల్లడైంది. తన రెండో భార్యను హత్య చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ అంబర్‌పేట్‌లో సమావేశమైన సమయంలో పోలీసులు దాడి చేసి ముగ్గురినీ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో తబీష్, సలామత్ అనే ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :