DNB News - తెలంగాణ / : రాజ్యాంగాన్ని కాపాడి పూర్తి స్థాయిలో అమలుపర్చడమే జేబీపీ లక్ష్యం జేబీపీ అధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ *కొత్తగూడెం జనవరి 26 డి ఎన్ బి న్యూస్ రిపోర్టర్ భారత రాజ్యాంగాన్ని కాపాడి పూర్తి స్థాయిలో అమలుపర్చడమే జేబీపీ లక్ష్యమని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద,బస్టాండ్ సెంటర్,గాజులరాజంబస్తీ,మథురబస్తీ తదితర ప్రాంతాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి,జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా సకల జనులకు ప్రాథమిక హక్కులు,ఆదేశిక సూత్రాలతో పాటు అందరూ సమానమే అని18 సంవత్సరాలు నిండిన వయోజనులకు ఓటు హక్కు రాజ్యాంగం ద్వారా వచ్చిందని,భిన్న భాషలు,భిన్న ప్రాంతాలు,భిన్న సంస్కృతులు,భిన్న మతాలు ఉన్న భారతదేశాన్ని ఒక త్రాటి మీదికి తీసుకువచ్చిన ఘనత భారత రాజ్యాంగానిదని ప్రతీ ఇంట్లో రాజ్యాంగం ఉండాలని,ప్రతీ ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలన్నారు.జేబీపీ జిల్లా కార్యాలయం నుండి పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ విగ్రహం వరకు వరకు అంబేడ్కర్ చిత్రపటంతో,రాజ్యాంగ పీఠికతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,నాగుల రవికుమార్,వినయ్,అల్లకొండ శరత్,రాజు,కిట్టు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News