DNB News - తెలంగాణ / : ఎయిమ్స్ భోపాల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సృష్టి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఎన్‌హెచ్ఆర్సీ సభ్యుడు ప్రియాంక్ కనూంగో సీరియస్‌గా స్పందించారు. తన విభాగాధిపతి డాక్టర్ పర్వేజ్ తరచూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపుల కారణంగానే డాక్టర్ సృష్టి నిద్ర మాత్రలు ఎక్కువగా తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో డాక్టర్ సృష్టి ఇప్పటికే మూడు సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఆస్పత్రి యాజమాన్యం సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎన్‌హెచ్ఆర్సీ.. భోపాల్ పోలీసులతో పాటు ఎయిమ్స్ యాజమాన్యం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇక యువ డాక్టర్ మృతి పట్ల ఎన్‌హెచ్ఆర్సీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా సమగ్ర దర్యాప్తు జరుగుతుందని వెల్లడించింది.
Admin
DNB News