DNB News - తెలంగాణ / : చైతన్యపురి, మల్కాజ్గిరి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఎస్.హెచ్.ఓ (SHO) శ్రీ కే. సైదులు గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారులను మరియు సిబ్బందిని ఎస్.హెచ్.ఓ శ్రీ కే. సైదులు గారు మరియు డి.ఐ (DI) శ్రీ గురు స్వామి గారు ఘనంగా సన్మానించి, వారి సేవలను అభినందించారు. సన్మానం పొందిన వారిలో సిబ్బంది ఉమెన్ పోలీసు కానిస్టేబుల్ లు డి. మౌనిక, దుర్గ, చంద్రకళ, వజ్రమ్మ, మీనా కుమారి, భవాని, రమణ, సోని, ధరణి ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్.హెచ్.ఓ శ్రీ కే. సైదులు గారు మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థలో మహిళా సిబ్బంది కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, సమాజ రక్షణలో మహిళా పోలీసులు చూపుతున్న నిబద్ధత గర్వకారణమని ఆయన ప్రశంసించారు. మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్‌స్పెక్టర్లు భద్రయ్య, వెంకటయ్య, గోవర్ధన్, విక్రమ్ రెడ్డి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జారీ చేసిన వారు: ఎస్.హెచ్.ఓ, చైతన్యపురి పోలీస్ స్టేషన్
Admin
DNB News