DNB News - తెలంగాణ / : రథసప్తమిని పురస్కరించుకొని కొత్తగూడెం ఎంజీ రోడ్ లో ఉన్న గణేష్ టెంపుల్ ఆలయంలో అవుటుపల్లి రాంబాబు గురుస్వామి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శిష్య బృందం డోలక్ రంజిత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ప్రత్యేక సంస్కృతి కార్యక్రమాలు పాటల కచేరిని నిర్వహించారు. అనంతరం గణేష్ టెంపుల్ ఆలయంలో మాఘమాస నెల రోజులు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ప్రీతిగా భక్తులకు గోత్రనామాలు పూజలతో పాటు సూర్య నమస్కార పూజల విధానాన్ని నిర్వహించబడుతుందని ఆలయ ఈవో తెలిపారు. సూర్య జయంతి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిగాయి. పాటల కార్యక్రమంలో చదలవాడ సూరి, గాయకుడు పేర్ల సుదీర్, సౌండ్ సిస్టం జీడి విశాల్, దారా రమేష్ భక్త బృందం ఆలయ భక్తులు పాల్గొన్నారు.
Admin
DNB News