Monday, 15 June 2026 02:18:44 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

వెలుగుమట్ల భూముల్లో ‘వసూళ్ల’పై ఖమ్మం సీపీ కీలక ప్రకటన

Date : 28 February 2026 11:52 AM Views : 229

DNB News - తెలంగాణ / : ఖమ్మం: వెలుగుమట్ల భూముల్లో వసూళ్లకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కుంటున్న ముఠాపై ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక ప్రకటన చేశారు. ఈమేరకు ఆయన గతరాత్రి పొద్దుపోయాక ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు అండగా ఉంటామని, బాధితుల నుంచి దోచుకున్న డబ్బును నిందితుల నుండి రికవరీ చేసి, ఆ సొమ్మును తిరిగి భాదితులకు అప్పగిస్తామని సునీల్ దత్ హామీ ఇచ్చారు. మరిన్ని కనుగొనండి ఖమ్మంలో ఖమ్మం ప్రభుత్వ భూముల్లో దురాక్రమణకు పాల్పడి కొంతమంది అక్రమంగా డబ్బులు వసూలు చేసి పేద ప్రజలకు భూములను కేటాయించారని చెప్పారు. ఈమేరకు పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 13 మందిపై నమోదు కేసుల నమోదు చేశామన్నారు. ఈ కేసుల్లో నిందితులైన తల్లూరి కృష్ణ, మంకిడి లింగరాజు, ముడిగ రాములు, కల్తీ ఎర్రబాబు అనే నలుగురు వ్యక్తులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. నిందితులు ఓ గ్యాంగ్‌గా ఏర్పడి, తాము OPDR భూదాన్ కమిటీ సభ్యులమని తప్పుడు ప్రచారం చేసి, అమాయక ప్రజలను ప్రేరేపించి భూదాన్ భూముల్లో గృహ స్థలాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఒక్కొక్కరి డబ్బులు వసూలు చేశారన్నారు. ఆ తర్వాత భూదాన్, ప్రభుత్వ, ప్రైవేట్ పట్టా భూములను అక్రమంగా ఆక్రమించి షెడ్లు నిర్మించారన్నారు. ఆ భూములను మరికొంతమంది అమాయకులకు అమ్మకానికి చూపించి మోసం చేశారని చెప్పారు. ఈ ముఠా చర్యల వల్ల అనేక మంది బాధితులు మోసపోయారని తెలిపారు. గృహ స్థలాలు ఇస్తామని చెప్పి అమాయక ప్రజల నుండి లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లు తేలిందన్నారు. ఈ ముఠా సభ్యులపై గతంలో సుమారు 15 కేసులు వరకు నమోదు అయినట్టు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఎవరైనా బాధితులు మోస పోయినట్లయితే ఫిర్యాదు చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ విజ్ఞప్తి చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :