DNB News - తెలంగాణ / : నడిగూడెం మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నడిగూడెం మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ . ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి “కేసీఆర్” అనే మూడు అక్షరాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భారీ కేక్‌ను కట్ చేసి కేసీఆర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజాసేవలో మరింత రాణించాలని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Admin
DNB News