Wednesday, 17 June 2026 03:21:46 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 08 May 2026 05:12 PM Views : 31

DNB News - తెలంగాణ / : సుజాతనగర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కొనుగోలు ప్రక్రియపై సమగ్రంగా ఆరా తీశారు. మొదటగా సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను సమగ్రంగా పరిశీలించారు. ఔట్ పేషెంట్ విభాగం, ఇన్ పేషెంట్ విభాగం, మందుల గది, సిబ్బంది హాజరు నమోదు పత్రాలు, ఔట్ పేషెంట్ రిజిస్టర్‌ను పరిశీలించి రోజువారీగా నమోదవుతున్న కేసుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రక్తపరీక్షలు, ఇతర నిర్ధారణ పరీక్షల నిర్వహణ, ల్యాబ్ సేవల పరిస్థితి, పరీక్షల ఫలితాలను రోగులకు సమయానికి అందిస్తున్న విధానంపై ఆరా తీశారు. మందుల నిల్వ గదిని పరిశీలించి అందుబాటులో ఉన్న మందుల స్టాక్, అవసరమైన మందుల లభ్యత, రికార్డుల నిర్వహణను తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వార్డులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోగులకు పరిశుభ్రమైన వాతావరణంలో మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. అనంతరం సుజాతనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ, నిల్వలు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, రవాణా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం, మొక్కజొన్న నిల్వల వివరాలను పరిశీలించి కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధాన్యం తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలపై ఆరా తీశారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని, రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండే పరిస్థితి రాకుండా చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మొక్కజొన్న తరలింపునకు తగినన్ని లారీలు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. లోడింగ్, రవాణా సమస్యల కారణంగా మొక్కజొన్న కేంద్రంలోనే నిల్వ ఉండిపోతుందని వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే తగినన్ని లారీలు ఏర్పాటు చేసి రవాణా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పి.ఆర్-126 రకం ధాన్యంలో “పిన్ పాయింట్ డ్యామేజ్” ఉన్నదనే కారణంతో రైస్ మిల్లర్లు ధాన్యాన్ని స్వీకరించడం లేదని రైతులు వివరించగా, దీనిపై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. రైతుల ధాన్యం ఎక్కడా నిల్వ ఉండకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎంతో శ్రమించి పండించిన ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైనన్ని గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, తాగునీరు, తేమ కొలిచే పరికరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారులు నిరంతరం అందుబాటులో ఉండి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ధాన్యం రవాణా, నిల్వ, లోడింగ్ తదితర అంశాలలో సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపీడీవో భారతి, వైద్య అధికారులు డాక్టర్ రమేష్ కొనుగోలు కేంద్రం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :