DNB News - తెలంగాణ / : ( ఆకు పాముల ) అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుందామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు డిమాండ్ చేశారు గురువారం ఆకుపాముల గ్రామంలో ఉపాధి కూలీ పని ప్రదేశాన్ని సందర్శించి ఆయన కూలీలతో మాట్లాడారు ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పథకం జి రాంజీ వల్ల కూలీలకు నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు చట్టంలో వచ్చిన అనేక మార్పులు వల్ల కూలీలకు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు పని ప్రదేశంలో రెండుసార్లు ఫోటో తీయడం వల్ల కూలీలు ఇబ్బంది పడుతున్నారని నెట్టు సరిగా లేకపోవడంతో ఆ రోజు కూలీలకు ఆబ్సెంట్ అవుతుందని ఆయన అన్నారు ఈ పద్ధతి వల్ల కూలీలకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు తెలిపారు పని ప్రదేశంలో రెండుసార్లు ఫోటో తీసే పద్ధతిని ఉపసర్వలించాలని ఆయన డిమాండ్ చేశారు కూలీలకు పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించి రోజుకు 600 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగు జానయ్య జిల్లా కమిటీ సభ్యులు అరె రామకృష్ణారెడ్డి ఉపాధి మెట్లు రమేష్ రెడ్డి వెంకటేశ్వర్లు లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News