DNB News - తెలంగాణ / : సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గణేష్ లాడ్జ్‌లో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిణీత అనే యువకుడు ఈరోజు11.45 pm అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు, ఘటనకు దారితీసిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Admin
DNB News