Saturday, 18 April 2026 06:01:04 PM
# మంగ్లీపై ఆరోపణల్ని ఖండిస్తున్నాం..అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు భూక్యా హరినాయక్ # విజయవాడలో బిజెపి కీలక సమావేశం – రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం.. # పోచమ్మ చెరువులో పూడికతీత పనులకు భూమి పూజ – స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై కలెక్టర్ డా.ఏ.సిరి అవగాహన # స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పోలీసుల స్వచ్ఛత కార్యక్రమాలు... # శాతవాహనలో ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు # విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కరీంనగర్ # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ లో పతకాలు # రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు

ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ జి. వెంకటేష్‌ను సస్పెండ్

Date : 05 March 2026 11:47 AM Views : 48

DNB News - తెలంగాణ / : హైదరాబాద్ పాతబస్తీలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపిన ఆరోపణల నేపథ్యంలో ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ జి. వెంకటేష్‌ను సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసు శాఖ నిబంధనలు, ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకపోవడం వంటి అంశాలు బయటపడటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. సమాచారం ప్రకారం గణేష్ ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి నిర్వహించిన కీలక సమావేశానికి ఎస్‌ఐ వెంకటేష్ గైర్హాజరైనట్లు గుర్తించారు. అలాగే నెహ్రూ నగర్ ప్రాంతంలో జరిగిన ఘటనలో రౌడీషీటర్ నిస్సార్‌పై తగిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇదే కాకుండా ముఖ్యమంత్రి రూట్ బందోబస్తు విధులకు హాజరు కాకపోవడం, ఎన్నికల డ్యూటీలు, లోకదాలత్ సమావేశాలకు గైర్హాజరు కావడం వంటి విషయాలు కూడా అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. డ్యూటీల కేటాయింపులో మతపరమైన భేదాలు చూపినట్లు వచ్చిన ఆరోపణలు కూడా తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ సేవా నియమావళి (టీజీసీఎస్ ) ప్రకారం ఎస్‌ఐ జి. వెంకటేష్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు ఆయనపై సస్పెన్షన్ కొనసాగుతుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. పోలీసు శాఖలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తూ విధి నిర్వాహణలో నిర్లక్ష్యాన్ని సహించబోమనే సందేశాన్ని ఈ చర్య ద్వారా ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు భావిస్తున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :