DNB News - తెలంగాణ / : హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి సి పి ఐ (Maoist) కు చెందిన తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్‌జీ మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దేవ్‌జీతో పాటు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి కూడా పోలీసుల సమక్షంలో లొంగిపోయినట్లు డీజీపీ వెల్లడించారు. ఈ విషయాన్ని డీజీపీ శివధర్ రెడ్డి విలేకరుల సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. లొంగుబాటు నేపథ్యంలో ప్రభుత్వ పునరావాస విధానం, భద్రతా చర్యలు తదితర అంశాలపై త్వరలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలపై ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశముందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.
Admin
DNB News