DNB News - తెలంగాణ / : వంట వంట గ్యాస్ రేట్ల పెంచడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని మాదిగ ఐక్యవేదిక సుజాతనగర్ మండల అధ్యక్షులు వేల్పుల భాస్కర్ అన్నారు, స్థిరంగా ఉన్న రేట్లు తగ్గించాల్సింది పోయి పెంచడం సరికాదన్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు తమ కుటుంబాలను పోషించుకోవటమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో గ్యాస్ రేట్లను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు, పెరుగుతున్న నిత్యవసరాల ధరలు వలన ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వచ్చే ఆదాయం ఖర్చులతో పోలిస్తే అప్పులపాలవక తప్పడం లేదన్నారు, గ్యాస్ నిత్యవసర ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చేసి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టి పరిధిలోకి తేవాలని అలా తేవడం ద్వారా వాటి రేట్లు సగం ధరకే వస్తాయని అన్నారు, గ్యాస్ బండపై రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తామని చెప్పిందని ఆ సబ్సిడీ మెజార్టీ ప్రజలకు అందటం లేదని గ్యాస్ డీలర్లు సబ్సిడీపై కేవైసీ పై వినియోగదారులకు సరైన సమాచారం అందించడం లేదని పేర్కొన్నారు, పాలక ప్రభుత్వాలు వెంటనే స్పందించి పెంచిన గ్యాస్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు
Admin
DNB News