DNB News - తెలంగాణ / : కొత్తగూడెం కార్పొరేషన్ మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్ లుగా గెలిపించుకోవాలని 25 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కనుకుంట్ల శ్రీనివాస్ అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని అభివృద్ధి చేసేందుకు 25వ డివిజన్ కార్పొరేటర్ గా మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరుతు ముమ్మర ప్రచారం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి చేతిగుర్తుకు ఓటువేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి విజవంతంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృధ్ది పథకాలను వివరిస్తూ.. ప్రచారంలో ముందుకు దూసుకేళ్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తూ తన సమీప అభ్యర్థుల ఆమె ప్రచారంలో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ సందర్భంగా 25వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కనుకుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు రాష్ట్రాన్ని, ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృధ్దిలో పరుగులు పెట్టిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో అభివృధ్ది, సంక్షేమం సమపాళ్లల్లో జరుగుతున్నదన్నారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలు పకడ్బందిగా అమలవుతున్నాయని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500 వంటగ్యాస్ సిలిండర్, రైతులకు రూ.2లక్షలలోపు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు విరివిగా ఇవ్వడం జరుగుతున్నదన్నారు. ఇవే కాక రైతుభరోసా, రైతుభీమా, కళ్యాణ లక్ష్మీ, షాధిముభారక్ వంటి పధకాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో అభివృధ్ధికి అన్నిరకాలుగా కృషి చేశానని ఆమె స్పష్టం చేశారు. సుమారు 10 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, తాగునీటికి ఇబ్బంది లేకుండా బోర్ల ఏర్పాటు, నీటి ఎద్దడి లేకుండా ఉండేలా శాశ్వత పరిష్కారం కోసం 10లక్షల లీటర్ల కెపాసిటీ తో వాటర్ ట్యాంక్ నిర్మాణం, అర్హులైన వారికి 75గజాల స్థలం, ఇందిరమ్మ ఇళ్ళు, 76 జీఓ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలిపిన ఆమె కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులను సాంక్షన్ చేయించడం జరిగిందని, కొన్ని ఆటంకాలు ఎదురైన స్థానిక ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా కమ్యూనిటి హల్ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేసేందుకు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు.
Admin
DNB News