Wednesday, 17 June 2026 02:36:05 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి

Date : 03 March 2026 01:06 PM Views : 65

DNB News - తెలంగాణ / : హైదరాబాద్: హోలీ పండుగను నగర ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని V.C. Sajjanar, ఐపీఎస్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పౌరులకు సూచించారు. ఇతరులకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని TGICCCలో పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా “విజిబుల్ పోలీసింగ్”కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నగరమంతా బ్లూ కోల్ట్స్, పట్రోలింగ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇష్టంలేని వ్యక్తులపై బలవంతంగా రంగులు చల్లడం సహించబోమని కమిషనర్ హెచ్చరించారు. రహదారులపై నడిచే ప్రజలపై, వాహనాలపై రంగులు వేయడం, ప్రజా ప్రదేశాల్లో అల్లరి చేయడం నేరమని తెలిపారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు షీ టీమ్స్ పని చేస్తాయని చెప్పారు. రసాయనిక రంగుల స్థానంలో సహజ రంగులు ఉపయోగించాలని ప్రజలకు సూచించారు. హోలీ వేడుకల సందర్భంగా డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గుంపులుగా రోడ్లపై తిరిగి అల్లరి సృష్టించే యువకుల వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం రంజాన్ నెల కొనసాగుతున్న నేపథ్యంలో ముస్లిం ప్రార్థనలకు ఎటువంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు భద్రత ఏర్పాటు చేసి, శాంతి కమిటీలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. హోలీ సందర్భంగా మార్చి 3 (మంగళవారం) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలు, తాటి కల్లు దుకాణాలు, బార్లు & రెస్టారెంట్లపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. నియమాలను ఉల్లంఘించే వారిపై సిటీ పోలీస్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కమిషనర్ తెలిపారు. నగరంలో ఎక్కడైనా శాంతి భద్రతల సమస్యలు తలెత్తితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించి హోలీ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు స్వేత, ఎస్‌.ఎం. విజయ్ కుమార్, డీసీపీలు ఖరే కిరణ్ ప్రభాకర్, రూపేష్, వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: