DNB News - తెలంగాణ / : ప్రభుత్వ ఆసుపత్రిలో దొంగలు పట్టుకోవడం లో ప్రభుత్వం విఫలం పేరుకే సీసీ కెమెరాలు పట్టించుకోని అధికారులు ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ వార్త : ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయని దొంగలను పట్టుకోవడంలో అటు అధికారులు ఇటు పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని బిజెపి టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ ఆరోపించారు. బుధవారం వాహనాలు చోరీకి గురవుతున్న విషయం తెలుసుకొని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య కారణాలవల్ల వివిధ ప్రాంతాల నుండి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వాహనాలు ద్వారా వచ్చేవారికి దొంగలు చుక్కలు నరకం చూపిస్తున్నారని, రోగి సహాయకులు, రోగిని చూసేందుకు వచ్చిన బంధువులు వారి వాహనాలను ఆస్పత్రి ఆవరణలో పార్కింగ్ చేస్తుంటారు. రోగులు వారి బాధల్లో వారు ఉంటే ఇదే అదునుగా భావించి కొందరు దొంగలు రెక్కీ నిర్వహించి వాహనాలకు హ్యాండిల్ లాక్ వేసినప్పటికీ. బైక్ లను దొంగిలించడం పరిపాటిగా మారింది. గతంలో సైతం బైకులు పోయిన ఘటనలు ఉన్నప్పటికీ ఇటు వైద్యాధికారులు, అటు పోలీసు అధికారులు ఎలాంటి భద్రత చర్యలు చేపట్టకపోవడం బాధాకరం అన్నారు.ఆసుపత్రి ఆవరణలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కేవలం కెమెరాలు చూసేందుకు తప్ప ఎక్కడ పనిచేయకపోవడం తో ఇదంతా కూడా ఆసుపత్రి వర్గాలకు సంబంధించి చోరీలు జరుగుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదన్నారు.ఎందుకంటే ఆసుపత్రి ఆవరణలో ఎక్కడ సీసీ కెమెరాలు పనిచేయడం లేదనే విషయం ఆసుపత్రి వర్గాలకు తప్ప మరెవరికి తెలిసే విషయం లేదు. గతంలో టోకెన్ ఇచ్చి వచ్చే వారికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చేసేవారు,కానీ వాహనాల పార్కింగ్ ను ఓ కాంట్రాక్టర్ లీజు తీసుకొని నడిపిస్తున్న క్రమంలో సోమవారం ఒక్కరోజే మూడు ద్విచక్ర వాహనాలు చోరీకి గురవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగులు, జర్నలిస్ట్ ల వాహనాలకే దిక్కు లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి వస్తున్న సామాన్యుల వాహనాలకు భద్రత లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే జంకుతున్నారని,అసలే అనారోగ్యాలు ఆపై వాహనాలు చోరీకి గురవడంతో ఇక ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో సామాన్యులు అల్లాడుతున్నారన్నారు.ఇప్పటికైనా అటు పోలీస్ యంత్రాంగం, ఆసుపత్రి వర్గాలు సరైన చర్యలు చేపట్టి సామాన్యుల వాహనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు.లేని యెడల ఆందోళన చేస్తామని హెచ్చరించారు.జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రిలో నిఘా ఏర్పాటు చేయకపోవడం సిగ్గు చెటని ఇప్పటికే ఎంతో మంది సామాన్యుల వాహనాలు పోయి ఇబ్బంది పడుతున్నారాన్నారు.అసలు ఆసుపత్రి వర్గాలు ఎం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారులు ఇటు మంత్రులు దృష్టి సారించకపోవడంతోనే వాహన చోదకులు పెరిగిపోతున్నారని ఆరోపించారు.ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటుచేసి ఆసుపత్రికి వస్తున్న వారి వాహనాలను కాపాడాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో తాజనూత భద్రం, రుద్ర గాని మాధవ్, పాశం శ్రీనివాసరెడ్డి, ఈశ్వర ప్రగడ లలిత దాసరి వీరభద్రం, ఇనుగుర్తి ఉపేంద్ర, శ్రీజర్ల వెంకట్ ఉన్నారు
Admin
DNB News