Wednesday, 17 June 2026 03:04:06 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

మొక్కజొన్న వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాల ప్రారంభం

Date : 21 April 2026 09:41 AM Views : 50

DNB News - తెలంగాణ / : తెలంగాణలో దళారి వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందన్నారు మాజీ మంత్రి... ఎమ్మెల్యే గంగుల కమలాకర్. పంట మార్పిడి చేయాలని చెబుతున్న ప్రభుత్వమే... పంట మార్పిడిలో భాగంగా సాగు చేసిన మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు... రైతులను ఇబ్బందులు పెడుతుందని వారు ఆరోపించారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంగుల నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పర్యటించారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న కొత్తపల్లి మండలం మల్కాపూర్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించిన ఆయన... తీసుకోవల్సిన చర్యల పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పంట మార్పిడితో భూమి సారవంతమవుతుందని... ప్రత్యామ్నాయన పంటలతో దిగుబడి పెరుగుతుందని... పంట మార్పిడిని ప్రోత్సహించిన ప్రభుత్వం... పంట మార్పిడిలో భాగంగా సాగు చేసిన మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బందులు పెడుతుందన్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో చొప్పదండి... మానకొండూర్ నియోజకవర్గాల్లో తప్ప... కరీంనగర్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలేదన్న గంగుల... కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ఎం.డితో మాట్లాడితే... ఇప్పుడు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో సుమారు 3 వేల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేశారని... సాగుకు అనుగుణంగా... ఒకటి కరీంనగర్ అగ్రికల్చర్ మార్కెట్ లో... మరొకటి కొత్తపల్లి మండలం మల్కాపూర్ లో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కజొన్న సాగు చేస్తే... ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని... 24 వందల మద్దతు ధరతో... ఎకరాకు 25 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని గంగుల తప్పుబట్టారు. ఎకరాకు 25 క్వింటాళ్ళు మాత్రమే కొంటామంటే... మిగతా 10 క్వింటాళ్ళ ధాన్యాన్ని రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు. దళారులకు అమ్ముకుంటే క్వింటాల్ కు 18 వందలు మాత్రమే చెల్లిస్తున్నారని... దీంతో ఒక్కో క్వింటాల్ పై రైతులు 6 వందల రూపాయల వరకు నష్టపోతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. దళారీ వ్యవస్థను ప్రోత్సహించడమే ప్రభుత్వ ధ్యేయమా అంటు ప్రశ్నించారు. ఎకరాన ఎన్ని క్వింటాళ్ళు పండితే అన్ని క్వింటాళ్ళు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న గంగుల... ఏదో మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాన్ని నడిపించి... మధ్యలో ఎత్తివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు కేంద్రాన్నీ నడిపించాల్సిందేనని డిమాండ్ చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :