DNB News - తెలంగాణ / : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఉన్న లేక్ షేర్ మాల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. మాల్‌లో ఉన్న సందర్శకులపై ఒక్కసారిగా హోర్డింగ్‌లు, యాడ్ బోర్డులు కుప్పకూలాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలు కావడంతో వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని సమాచారం. ఆదివారం సెలవుదినం కావడంతో మాల్‌లో సాధారణంగా ఉండే జనసంచారం కంటే తక్కువగానే ఉంది. ఈ సమయంలోనే ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. హోర్డింగ్‌లు ఒక్కసారిగా పడిపోవడంతో మాల్‌లో ఉన్న వినియోగదారులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన మాల్ సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Admin
DNB News