DNB News - తెలంగాణ / : స్థానిక కరీంనగర్ సిద్ధార్థ విద్యాసంస్థల విద్యార్థులు పదవ తరగతి ఫలితాలలో విజయదుందుభి మోగించారు. ఈ ఏడాది పరీక్షలకు హాజరైన 452 మంది విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, కె. విశ్వక్సేన్ 592 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు.మెరిసిన సిద్ధార్థ ఆణిముత్యాలు, జిల్లా టాపర్: కె. విశ్వక్సేన్ (592 మార్కులు)31 మంది విద్యార్థులు, 570 కంటే ఎక్కువ మార్కులు, 74 మంది విద్యార్థులు 560 కంటే ఎక్కువ మార్కులు,122 మంది విద్యార్థులు,550 కంటే ఎక్కువ మార్కులు సిద్ధార్థ 30 సంవత్సరాల ప్రస్థానంలో ప్రతి నలుగురు విద్యార్థులలో ఒకరు 550కి పైగా మార్కులు సాధించడం సంస్థ యొక్క విద్యా ప్రమాణాలకు నిదర్శనం. పదవ తరగతి ఫలితాల్లోనే కాకుండా ఐ.ఐ.టి, నీట్ విభాగాలలో కూడా సిద్ధార్థ విద్యార్థులు ముందంజలో ఉండడం విశేషం.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి, తల్లిదండ్రులకు, చదువు చెప్పిన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి , డైరెక్టర్ స్వప్న శ్రీపాల్ రెడ్డి , ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.
Admin
DNB News