DNB News - తెలంగాణ / : భార్య వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. Secunderabad పరిధిలోని నేరెడ్మెట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తి భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతుడు తన ఆత్మహత్యకు భార్య జ్యోతి వేధింపులే కారణమని పేర్కొంటూ సూసైడ్ నోట్ కూడా రాసినట్లు పోలీసులు తెలిపారు. వీరి వివాహం దాదాపు 13 సంవత్సరాల క్రితం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనపై మృతుడి సోదరుడు శివకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.
Admin
DNB News